టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా SMలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు నందిపాటి మురళి సీపీ సజ్జనార్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేసే అవకాశం ఉంది.