KKD: పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో బుధవారం కాయకల్ప్ రాష్ట్ర బృందం తనిఖీలు నిర్వహించింది. సూపరింటెండెంట్ ఆర్.ఉమా మహేశ్వరి సమక్షంలో కాయకల్ప్ బృందం అన్ని విభాగాల రికార్డులను పరిశీలించింది. ఆస్పత్రిలో శానిటేషన్,రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, భోజనం, మందుల పంపిణీ, సిబ్బంది ప్రవర్తనపై వారు ఆరా తీశారు. ఈ తనిఖీలో అసెస్మెంట్ నోడల్ ఆఫీసర్ పాల్గొన్నారు.