SRD: స్కౌట్ అండ్ గైడ్స్ కింద ఎంపికైన 38 పాఠశాలల నుంచి పాఠశాలల పీఈటీలకు గురువారం కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పీఈటీలు సమయానికి శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.