కోనసీమ: అంబాజీపేట మండలం మాచవరం శివారు పోతాయిలంక వెళ్లే ప్రధాన రహదారిలోని ONGC రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని బుధవారం ఓ పీచు లారీ ఢీకొట్టింది. స్తంభం మధ్యకు విరిగిపోయి, విద్యుత్ తీగలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.