SRD: కారు ఆటో ఢీకొన్న సంఘటన కంగ్టి మండలం రాజారాం తండా వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు రామతీర్థ్కు చెందిన పండరి తన ఆటోలో ప్యాసింజర్తో కంగ్టికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న తవేరా కారు అదుపు తప్పి ఆటోను ఢీకొంది. ఆటో డ్రైవర్ పండరి కుడి కాలికి బలంగా దెబ్బ తగిలింది. దాంతో 108లో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.