WNP: తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ క్రికెట్ అకాడమీ వనపర్తి జిల్లాకు చెందిన పార్వతి BCCI అండర్ 19 జట్టుకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ సరస్వతి తెలిపారు. ఈనెల 26 నుంచి నవంబర్ 2 వరకు ముంబయిలో జరిగే సెలక్షన్ పోటీలలో పార్వతి పాల్గొంటుందని తెలిపారు. పార్వతి, పీఈటీలు మన్నన్, ఝాన్సీ లక్ష్మిలను కళాశాల ప్రిన్సిపల్ సరస్వతి, అధ్యాపకులు అభినందించారు.