మేడ్చల్: సర్కారు దావాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు.బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన డీఎంహెచ్‌వో చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న టీబీ, ఎన్ సీడీ, ఇమ్యూనైజేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, ఆసుపత్రుల నిర్వహణ వంటి అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.