MLG: వెంకటాపురం మండల కేంద్రంలో కొమరం భీం 125వ జయంతి వేడుకలను ఆదివాసి సంఘాల నేతల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి కులమాలవేసి నివాళులు అర్పించారు. వారు గిరిజనుల సంక్షేమం కోసం చేసిన పోరాటాలను కొనియాడారు. వారి ఆశయాలను నెరవేర్చేలా నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘం ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.