కాకినాడ: తుని అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటన స్థలంలో అత్యాచార ఘటనను పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాట్లుగా సమాచారం. నారాయణరావు ఏం చెప్పి తీసుకెళ్లాడు.. ఏం చేశాడు.? అనే వివరాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు నారాయణ రావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే.