GNTR: పొన్నూరు శివారులో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని, మృతదేహాల అప్పగింత ఫార్మాలిటీస్‌ను వేగంగా పూర్తి చేయాలని బుధవారం సబ్ కలెక్టర్, సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.