WGL: చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో ఇవాళ బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో MPTC స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.