ERL: ఈనెల 30, 31 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. జిల్లాలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈ జిల్లా మహాసభల్లో రైతుల సమస్యలను ప్రస్తావించడం జరుగుతుందని అన్నారు. అలాగే వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.