MLG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగపరుచుకోవాలని ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ రేగ కళ్యాణి కోరారు. ములుగు మండలంలోని జంగాలపల్లి, ఇంచర్ల, వెంకటాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె ప్రారంభించారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించకుండా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మాలని ఆమె రైతులకు సూచించారు.