GNTR: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెదనందిపాడు గ్రామంలో బుధవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. మండల కన్వీనర్ షేక్. ఖాశిం పీరా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్య విద్యను కాపాడుకోవాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.