SRPT: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ. 50వేల నష్టపరిహారం అందించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం గరిడేపల్లిలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందించి మాట్లాడారు. అకాలవర్షాల కారణంగా వరిపొలాలు మొత్తం పడిపోయి, రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని, వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు.