AP: సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన శోభా గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌తో భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణంలో శోభా స్థిరాస్తి సంస్థ భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. దీంతో అమరావతిలో గ్రంథాలయం నిర్మాణానికి శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది.