ఒక్క రోజులోనే బంగారం ధర దాదాపు రూ. 9వేలు దిగొచ్చింది. తాజాగా దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,250కి పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,843కు చేరుకుంది. మరోవైపు వెండి కూడా ఇవాళ రూ.7వేలు తగ్గి రూ.1,58,000 పలుకుతోంది. వారం రోజుల్లో కిలో వెండి ధర దాదాపు రూ. 28వేలు తగ్గింది.