MBNR: మానవ అక్రమ రవాణా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని MBNR రూరల్ ఎస్సై మహేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్లో ప్రజా భద్రత పోలీసు బాధ్యత కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు, ప్రజలకు సైబర్ నేరాలు,, ఇతర నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించడం నేరమని పేర్కొన్నారు.