ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత అండతోనే పాపంపేట భూములు కబ్జాకు గురయ్యాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. 1900లో శోత్రియం దస్తావేజుల ఆధారంగా జీపీఏలు, రిజిస్టర్లు చేయించి 176 ఎకరాలకు ఫోర్జరీ పొజిషన్ సర్టిఫికెట్లు పొందారని ఆరోపించారు. ఈ అక్రమాలపై కలెక్టర్, రెవెన్యూ, పోలీసు అధికారులు వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.