NLR: సంగం మండలంలో ఇవాళ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెన్నా బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజి వద్ద 79 గేట్ల ద్వారా 62,800 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.పెన్నా పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.