ప్రకాశం: కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామంలో గల గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో వీరభద్రాచారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విధుల్లో అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.