NDL: పాణ్యం మండలం సుబ్బరాయుని కొత్తూరు గ్రామంలో ఇవాళ కార్తీక మాసం పూజలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వరస్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలను చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రధాన అర్చకుడు సురేష్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు.