BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే స్థానికంగా పలువురుతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. వారితోపాటు సీపీఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.