టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన.. దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. శర్వా కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తయిన తర్వాత ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.