SRPT: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఈ నెల 14న అనుమానాస్పదంగా మృతి చెందిన చెన్న అనసూర్యమ్మ హత్యకేసును పోలీసులు చేధించారు. విచారణలో నిందితులు సతీష్, అతని భార్య మౌనిక హత్యకు పాల్పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. వారు దొంగిలించిన రూ. 3.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవర్ చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు వివరాలను ఎస్పీ మీడియాకు తెలిపారు.