హీరోయిన్ సమంత గొప్ప మనసు చాటుకున్నారు. ఆమె స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్లో చిన్నారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులతో ఆమె సరదాగా గడిపారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ.. పిల్లలతో ఆనందంగా గడపాను అని తెలిపారు.