BDK: దీపావళి, నరక చతుర్దశి పండుగ సందర్భంగా భద్రాచలం ITDA కార్యాలయంలో రేపు జరగబోయే గిరిజన దర్బార్ను రద్దు చేసినట్లు ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ ఉన్నందున ఐటీడీఏ యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండని కారణంగా దర్బార్ను రద్దు చేయడం జరిగిందని పీవో వెల్లడించారు. ఈ విషయాన్ని గిరిజనులు గమనించాలని కోరారు.