VZM: తెర్లాం మండలం కవిరాయనివలస పంచాయతీ బొంగుపేటలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి ఆవు మృతి చెందింది. మరిశర్ల ఆదినారాయణ ఆవు పొలంలో మేత మేస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు మరణించడంతో ఆదినారాయణ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరణించిన ఆవును వేటనరీ అసిస్టెంట్ విజయ, వీఆరి రవికుమార్ పరిశీలించారు.