W.G: మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం తన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.