ప్రఖ్యాత పారిస్ ఆర్ట్ మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాలరీ అద్దాలను పగులగొట్టి మ్యూజియంలోకి ప్రవేశించి.. నెపోలియన్ కాలంనాటి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోనాలిసా ఒరిజినల్ పెయింటింగ్ కూడా ఉండటం గమనార్హం.