JGL: మెట్పల్లి మండలం వేంపేట పెద్దమ్మ, చింతల్పేట చౌరస్తాల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ మంజూరు చేసిన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజ్ పాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, నవీన్, రామస్వామి పాల్గొన్నారు