NLR: వర్షాకాలం నేపథ్యంలో నెల్లూరు ఆర్టీసీ ఆత్మకూరు బస్టాండ్ పరిసరాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ గ్యారేజ్ సిబ్బందికి, మహిళా కార్మికులకు సోమవారం ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సుమారు 50 మందికి రెయిన్కోట్లు పంపిణీ చేశారు. ఈ సిబ్బంది ప్రయాణికులకు ఎప్పటికప్పుడు మంచి సేవలందించేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్నారు.