SRD: నారాయణఖేడ్ పట్టణంలోని MLA క్యాంపు ఆఫీస్లో ఇవాళ సాయ దీపావళి లక్ష్మీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి అనుపమ దంపతులు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు చేశారు. అనంతరం మంగళహారతి నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ప్రజలపై లక్ష్మీమాత అమ్మవారి అనుగ్రహం అందరి పై ఉండాలని ఎమ్మెల్యే అమ్మవారిని వేడుకున్నారు.