TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై BRS అధినేత KCR అప్రమత్తమయ్యారు. ఉపఎన్నికల్లో విజయం కోసం కీలక కార్యాచరణ రూపొందించడానికి రేపు పార్టీ ఇన్చార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి KTR, హరీష్ రావు సహా ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై KCR దిశానిర్దేశం చేయనున్నారు.