ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే, కెప్టెన్సీ కోల్పోవడం వల్లే రోహిత్ విఫలమైనట్లు నెట్టింట వార్తలొస్తున్నాయి. గిల్ నాయకత్వంలో ఆడటం ఇష్టం లేదని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఆ కథనాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అదంతా కేవలం అపోహని.. ఎవరూ అలా ఆడరని తెలిపాడు.