మేడ్చల్: దుండిగల్-గండిమైసమ్మ మండల తహసీల్దార్‌గా ఎన్. రాజేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. గత మూడున్నర సంవత్సరాలుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయంలో ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆయన్ను ఇక్కడికి బదిలీ చేస్తూ కలెక్టర్ మను చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు.