MDK: రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ‘భూ భారతి’ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆర్డీవో రమాదేవి ఆదేశించారు. చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ‘భూ భారతి’ దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతికి పలు సూచనలు చేశారు.