SKLM: రోడ్డు వైపు ఉన్న మెట్ల నిర్మాణం చేసినపుడు జాగ్రత్త వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. శ్రీకాకుళం మహిళా కళాశాల వద్ద నిర్మిస్తున్న పింక్ టాయిలెట్‌ను బుధవారం JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. మరుగుదొడ్లను వినియోగించేటప్పుడు తగిన సూచనలు సలహలు ఇవ్వాలని స్థానిక సిబ్బందిని కోరారు.