ATP: గుత్తిలో జరిగిన రచ్చబండలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరిని జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించారని అన్నారు. డీజీపీ, డీఐజీ, ఎస్పీ చేతగానితనంతోనే చట్టవ్యవస్థ క్షీణించిందని అన్నారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుంటే సామాన్యులు ఎలా ఉంటారని ప్రశ్నించారు.