KRNL: ఆదోని పట్టణంలో APHB కాలనీకి చెందిన ఎ. నూర్ అహమ్మద్ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఇరు మతాలు, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, మనోభావాలను దెబ్బతీసే అంశాన్ని పోస్ట్ చేశారు. ఈ అంశంపై శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, CI శ్రీరాం ఇవాళ అహ్మద్‌ను స్టేషన్‌కు పిలిపించి, మందలించి, కౌన్సిలింగ్ నిర్వహించారు. బైండ్ ఓవర్ చేయడంతో పాటు వార్నింగ్ ఇచ్చారు.