TG: సీఎం రేవంత్ రెడ్డి అన్ని సగం సగం పనులే చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పండిన పంట అంతా కొనుగోలు చేస్తాం.. బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కోతలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం ఆలస్యంగా మక్కలు, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంపై ధ్వజమెత్తారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి.. సన్న వడ్లకు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.