BDK: పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామ నివాసి ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సాంబశివరావు సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం రూ. 42 వేల ఆర్థిక సహాయం బుధవారం అందజేశారు. సంఘ నాయకులు మాట్లాడుతూ.. సాంబశివరావు నిరుపేద కావడంతో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు.