శ్రీలంకలో వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు చొరబడి ఆయనపై పలురౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.