KMM: కూసుమంచి మండలం నర్సింహులగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన జి.వీరయ్యను అడిషనల్ కలెక్టర్, ఇంఛార్జ్ డీఈవో శ్రీజ సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్లో పనిచేస్తున్న సమయంలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు డీఈవోకు ఫిర్యాదు చేయగా, ఎంఈవో విచారణ చేపట్టి నివేదిక సమర్పించడంతో పరిశీలించి సస్పెండ్ చేశారు.