CTR: భారీ వర్షాల ప్రభావంతో పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పూతలపట్టు MLA మురళీమోహన్ పరిశీలించారు. బుధవారం పూతలపట్టు నియోజకవర్గ అధికారులతో కలిసి పూతలపట్టు ఏరు, సామనత్తం వంక, పంటపల్లె వంక, పోతునాయుడు చెరువు, ఆకనంబట్టు వంక వంటి ప్రాంతాలను ఆయన సందర్శించారు. ప్రాంతాల వారీగా పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.