NDL: బనగానపల్లె పట్టణంలో గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి సతీష్ కుమార్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని పలు దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. పాత బస్టాండ్లో ఉన్న దుకాణాలలో ప్లాస్టిక్ కవర్లు బయటపడటంతో దుకాణాల యజమానులకు జరిమానా విధించినట్లు సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు.