NGKL: సిర్శనగండ్ల గ్రామ పంచాయతీలో ఒక్కరోజులో తొమ్మిది మందిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇంత జరిగినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వరుస దాడులతో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు భయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారని స్తానికులు వాపోయారు. అధికారులు వెంటనే ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.