JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామ శివారులోని దుర్గామాత దేవాలయంలో దొంగతనం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. దొంగలు దేవాలయంలోకి చొరబడి అమ్మవారి మెడలో ఉన్న 5 మాసాల బంగారు ఆభరణాలు (పుస్తెలతాడు, మట్టెలు) ఎత్తుకెళ్లారు. దేవాలయంలో ఉన్న హుండీని సైతం ధ్వంసం చేసి డబ్బులు చోరి చేశారు. సంఘటనా స్థలాన్ని SI నవీన్ కుమార్ పరిశీలిస్తున్నారు.