VZM: కురుపాం మండలంలో పలు గిరిశిఖర గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. చాపరాయిగూడ నుంచి నీలకంఠాపురం వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ట్రాన్స్ ఫార్మర్ పాడవడంతో మోసుకుంటా తీసుకెళ్లామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్నారు.