TG: రైతుల భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లోకి వెళ్లాలని MROలకు మంత్రి జూపల్లి కృష్ణరావు ఆదేశించారు. నవంబర్ 1 నుంచి 30 వరకు గ్రామాల వారీగా భూ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో మాట్లాడిన మంత్రి.. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకే భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.